వన్డే క్రికెట్ లో మరో కొత్త రూల్.. ఐసీసీ కమిటీ ప్రతిపాదన! దీనిపై జింబాబ్వేలో..

  Sun Apr 13, 2025 15:07        Sports

వన్డే మ్యాచ్ లకు సంబంధించి ఐసీసీ మరో కొత్త రూల్ అమలులోకి తీసుకురానుందని సమాచారం. మ్యాచ్ లో ఒక ఇన్నింగ్స్ కు ఒకే బంతిని వాడాలని ఐసీసీ కమిటీ తాజాగా ప్రతిపాదించింది. దీనిపై ఐసీసీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం వన్డే మ్యాచ్ లో ఒక్కో ఎండ్ కు రెండు బంతుల చొప్పున నాలుగు కొత్త బంతులు వాడుతున్నారు. మ్యాచ్ లో 25 ఓవర్ల తర్వాత బంతిని మారుస్తున్నారు. గతంలో మ్యాచ్ మొత్తం ఒకే బంతిని ఉపయోగించేవారు. దీనివల్ల బంతి పాతబడిన కొద్దీ బౌలర్లకు మరింత పట్టు లభించేది. రివర్స్ స్వింగ్ తో పాటు స్పిన్నర్లకు కూడా బంతి అనుకూలించేది. ఈ రూల్ మార్చేశాక బ్యాటర్ల ఆధిపత్యం మొదలైంది. తాజాగా దీనికి అడ్డుకట్ట వేసేందుకు సౌరభ్ గంగూలీ నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్ కమిటీ ఓ కీలక ప్రతిపాదన చేసింది. ఒక్కో ఎండ్ లో కొత్త బంతి కాకుండా ఒక జట్టు ఇన్నింగ్స్ పూర్తయ్యే వరకూ ఒకే బంతిని ఉపయోగించాలని సూచించింది. దీనిపై జింబాబ్వేలో జరుగుతున్న ఐసీసీ సమావేశాల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. సొంత నియోజకవర్గంలో మరో హామీకి శ్రీకారం!

 

మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!

 

ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!

 

NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

 

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

 

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia